Grand preparation For Power Star Next Movie

Thursday, 7 June 2012



‘గబ్బర్ సింగ్' బంపర్ హిట్‌తో మంచి జోష్ మీద ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి అలాంటి హిట్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఈ మేరకు తన నెక్ట్స్ ప్రాజెక్టర్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం కోసం గ్రాండ్‌గా ప్రిపేర్ అవుతున్నారు. క్రేజీ దర్వకడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో తమన్నా హీరోయిన్‌గా ఎంపికయింది.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ 15 నుంచి ప్రారంభం కానుంది. తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో జరుగబోతోంది. షూటింగు కోసం ఇక్కడ భారీ సెట్ వేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
ఈచిత్రం పవర్ ఫుల్ సబ్జెక్టు, అంతకంటే పరవ్ ఫుల్ డైలాగ్స్ కలగలిపి అదిరిపోయే ఎంటర్‌టైన్మెంట్ సినిమాగా రూపొందబోతోంది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ న్యూస్ ఛానల్ రిపోర్టర్‌గా కనిపించనున్నాడు. ప్రతి రంగంలోనూ మంచి వారు, చెడ్డ వారు ఉన్నట్లే మీడియా రంగంలోనూ అక్రమార్కులు, చీడ పురుగులు ఉన్నారు. ఈ చిత్రంలో మీడియాలోని చీడ పరుగులపై సెటర్లు ఉంటాయని, విలువలు దిగజార్చి మీడియాను డబ్బు సంపాదించడానికి, అక్రమార్జనకు వాడుకుంటున్న వారిని ఎండగట్టే విధంగా డైలాగులు ఉంటాయని అంటున్నారు.
సినిమా షూటింగుల విషయంలో పక్కా ప్లాన్ ఫాలో అయ్యే దర్శకుడు పూరి జగన్నాథ్...ఈచిత్రాన్ని పర్ ఫెక్ట్ ప్లాన్ ప్రకారం పూర్తి చేసి అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాన్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి ఇప్పటి వరకు ముఖ్య తారాగణంగా ఎంపికైన వారిలో ఉన్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support : Chalana Chithra
Copyright © 2012. Chalana Chithra - All Rights Reserved
Template Created by C C
Proudly powered by Blogger