Endukante Premanta First Day First Show Updates Telugu

Thursday, 7 June 2012

Updated at 11:35 AM
ఎవరూ ఊహించని రీతిలో సినిమాని ముగించి శుభం కార్డు వేసారు...
మరికొద్ది సేపట్లో మీకోసం సినిమా రివ్యూ అందజేస్తాం ఫ్రెండ్స్ .......

Updated at 11:25 AM
ఇప్పుడే సినిమాలో ఊహించని మరొక మలుపు, దీనితో ఖచ్చితంగా సినిమా క్లైమాక్స్ కి చేరుకోనుంది.
Updated at 11:16 AM
చిత్రంలో ఐదవ పాట ' ఎగిరి పోవే ' మొదలైంది, దీన్ని బట్టి చూస్తే సినిమా క్లైమాక్స్ కి చేరుకోవడానికి ఇంకా సమయం ఉంది....

Updated at 11:02 AM
ఒక బారీ ఫైట్ తో సినిమా క్లైమాక్స్ కి చేరుకుంటోంది............

Updated at 10:44 AM
నాలుగో పాట ' లండన్ సిన్డ్రెల్లా ' మొదలైంది.. ఈ పాటలో తమన్నా చాలా అందంగా ఉన్నారు.....

Updated at 10:44 AM
ప్రిన్సిపాల్ పాండు రంగారావు గా బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చారు......
Updated at 10:32 AM
ఇప్పుడు సినిమా పగ, ప్రతీకారాల నేపధ్యంలో నడుస్తోంది...

Updated at 10:13 AM
విలన్ కోకా భాయ్ గా కోన వెంకట్ ఎంట్రీ ఇచ్చారు. కథలోని మలుపుతో సినిమా ఒక విభిన్నమైన ప్రేమకథగా మారింది .... ఇంతటితో మొదటి అంకం సమాప్తం ...
మొదటి అర్ధ భాగం కొంత కామెడి, కొంత అందమైన రొమాంటిక్ ట్రాక్ తో ముగిసింది ............
రెండవ అర్ధ భాగం ఈ చిత్రానికి కీలకం కానుంది....

Updated at 10:02 AM
సినిమాలో అవాక్కయ్యే మలుపు, ఆ మలుపుతో కథ చాలా ఆసక్తిగా, వేగంగా ముందుకు సాగుతోంది......

Updated at 9:52 AM
ఇప్పుడు కథలో మూడవ పాట' కిక్కో గిక్కో' మొదలైంది, ఈ పాటని పారిస్ లోని ఈఫిల్ టవర్ వద్ద చిత్రీకరించారు.....

Updated at 9:45 AM
రామ్ మరియు తమన్నా ల రొమాంటిక్ ట్రాక్ చాలా అందంగా తెరకెక్కించారు. యూరోపియన్ ఫైటర్స్ ని రామ్ తరిమి తరిమి కొట్టే మొదటి ఫైట్ బాగుంది.

Updated at 9:22 AM
ఫ్రెంచ్ వైన్ మేకర్ అయిన పుల్లా రెడ్డి పాత్రలో నాగినీడు, నాగినీడు కి అసిస్టెంట్ పాత్రలో రఘుబాబు కథలో దర్శనమిచ్చారు

Updated at 9:12 AM
రామ్ కుటుంబ సభ్యులుగా షియాజీ షిండే, కృష్ణ భగవాన్ పాత్రలు తెరకు పరిచయమయ్యాయి..వీళ్ళ మధ్య వచ్చే కామెడి చాలా బాగుంది.

Updated at 9:06 AM
హీరో రామ్ చాలా స్టైలిష్ గా ' ఎనర్జిటిక్ స్టార్ ' గా ఎంట్రీ ఇచ్చారు.ఇంట్రడక్షన్ సాంగ్ ' లైఫ్ అంటే ' లో డాన్సులతో ఇరగదీస్తున్నాడు...

Updated at 9:05 AM
తమన్నా పాత్ర పేరు స్రవంతి ..... స్రవంతి కి తండ్రిగా సుమన్ పాత్రను తెరకు పరిచయం చేసారు....

Updated at 9:02 AM
కథ ఫ్లాష్ బ్యాక్ నుంచి ప్రస్తుతం లోకి ప్రవేశించింది.............. పారిస్ లోని ఒక బిగ్ షాట్ కూతురిగా తమన్నా ఎంట్రీ ఇచ్చింది.......

Updated at 9:01 AM
కథలో ఊహించని విషాదంతో ముందుకు సాగుతోంది....

Updated at 8:58 AM
వీరిద్దరి కలయికతో ' నీ చూపులే ' అనే పాట మొదలయింది. ఈ పాటకి సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది...

Updated at 8:54 AM
తమన్నా 1980 కాలంనాటి చాలా సాంప్రదాయబద్దమైన వస్త్రాలలో, అందం గా కథలోకి వచ్చారు. రామ్ ఎంట్రీ కూడా చాలా సింపుల్ గా కథలోకి ప్రవేశించింది. ఇద్దరి జంట చూడ ముచ్చటగా ఉంది......

Updated at 8:50 AM
హలో ఫ్రెండ్స్ ..... మీ కోసం రామ్, తమన్నా జంటగా నటించిన 'ఎందుకంటే ప్రేమంట' లైవ్ అప్డేట్స్ అందిస్తున్నాము.......

సినిమా ఇప్పడే 1980 ఫ్లాష్ బ్యాక్ తో వైజాగ్ నేపధ్యంలో కథ మొదలైంది
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support : Chalana Chithra
Copyright © 2012. Chalana Chithra - All Rights Reserved
Template Created by C C
Proudly powered by Blogger